రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తమిళిసై అసహనం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తమిళిసై అసహనంరాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తమిళిసై అసహనం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు.

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.