ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు భారీ జరిమానా
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 15వ సీజన్ లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది.బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు, తుది జట్టులోని మిగిలిన 10 మందికి రూ. 6 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో పేర్కొన్నది.