20న వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

20న వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఈ నెల 20న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య తదితరులతో కలిసి మంత్రి సమీక్షించారు.20న వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

కేటీఆర్ రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరికొన్ని పూర్తైన పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ టూర్ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.