మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు

మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టుమందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు

వరంగల్ టైమ్స్ , విశాఖ : మందు బాబులకు విశాఖ కోర్టు వినూత్న శిక్ష వేసింది. గడిచిన మూడ్రోజుల్లో విశాఖ జిల్లాలో చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ లో 52 మంది మందు బాబుటు పట్టుబడ్డారు. వారిని ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చగా, విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వినూత్న శిక్ష విధించింది.

మందుబాబులందరూ విశాఖ బీచ్ లో ఉన్న వ్యర్ధాలను వేరేసి బీచ్ ను శుభ్రపరచాలని అనూహ్యమైన తీర్పు వెలువరించింది. దీంతో అధికారులు వారిని బీచ్ కు తీసుకెళ్లారు. బీచ్ లో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయించారు.