వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా : మాజీ జేడీ

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా : మాజీ జేడీ

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా : మాజీ జేడీ

వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. ఈ అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం ఎంపీ గా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ఏదైనా పార్టీ తన ఆలోచనా విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.