భూసమస్యలు పరిష్కరించాలి: ములుగు జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా: భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సంబంధిత రికార్డులను ధరణి వెబ్ సైట్ లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామ రెవిన్యూ అధికారులు స్థానికంగా మండల కేంద్రంలోనే నివసిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. స్థానిక చిరునామా వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డు రూమ్ కు సంబంధించి పనులు పూర్తి చేయాలని, భూసమస్యలు పరిష్కరించాలి: ములుగు జిల్లా కలెక్టర్మీ సేవ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. హాజరును ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ ద్వారా నమోదు చేయాలని ఆయన అన్నారు. విధుల పట్ల అలక్ష్యం సహించేది లేదని,కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, గ్రామ రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.