వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదు

వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వరంగల్ లో తొలి కరోనా మరణం నమోదుఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వ్యక్తి కరోనాతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారులు (DMHO) తెలిపారు.