తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై చర్చించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని సర్కార్‌ భావిస్తున్నది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.