ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ సేవలు భేష్ : దాస్యం

ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ సేవలు భేష్ : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వ్యక్తిగా సాధించలేనిది వ్యవస్థగా సాధించగలమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలో ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ 2022-2024 నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. తదనంతరం చీఫ్ విప్ ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఒక వ్యక్తిగా సాధించలేనిది వ్యవస్థగా సాధించగలమనే వాస్తవాన్ని వాకర్స్ అసోసియేషన్ చేసి చూపెడుతుందని అన్నారు. ఏకశిలా వాకర్స్ అసోసియేషన్ సేవలు భేష్ : దాస్యంవాకర్స్ అసోసియేషన్ ఇప్పుడు దేశమంతటా వ్యాపించి ఉందని తెలిపారు. హనుమకొండ జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని చీఫ్ విప్ కొనియాడారు. నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ పార్కుల అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని దాస్యం వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. తదనంతరం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు లబ్దిదారులకు రెండు లక్షల ఆరవై ఎనిమిది వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.