అక్కడ సామ్ సంగ్ సేవలు నిలిపివేత

అక్కడ సామ్ సంగ్ సేవలు నిలిపివేత

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో బహుళజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూట్యూబ్ , ఫేస్ బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యాకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్ సంగ్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్ ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటామని స్పష్టం చేసింది.అక్కడ సామ్ సంగ్ సేవలు నిలిపివేత

మరోవైపు యుద్ధభూమి ఉక్రెయిన్ కు 6 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. రష్యా హ్యాండ్ సెట్ మార్కెట్ లో సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలో సామ్ సంగ్ 30 శాతం వాటా కల్గిఉంది. తర్వాత 23 శాతంలో షావోమి, 13 శాతం వాటాతో యాపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ లో పాటు నైక్, ఐడియా వంటి సంస్థలు ఇప్పటికే తమ అమ్మకాలను నిలిపివేశాయి. కాగా, హ్యాండ్ సెట్ మార్కెట్ లో 44 శాతం వాటా కల్గిన చైనీస్ సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాల కొనసాగింపు విషయంలో స్తంబ్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్ పై దాడి విషయంలో రష్యాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ చైనా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా సంస్థలు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి.