పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

వరంగల్ టైమ్స్, కర్నూలు జిల్లా : ఏపీలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శనివారం ఉదయం కర్నూలులోని శ్రీలక్ష్మీనగర్ లో ఉంటున్న విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు. ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చిలో పినాకాపానిపై ఎన్ ఐఏ కేసు నమోదు చేసింది.పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలుఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు రావాలని అధికారులు తెలిపారు. కాగా, గతంలో కూడా పినాకపాణిని ఎన్ ఐఏ విచారించిన విషయం తెలిసిందే. గత యేడాది పినాకాపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలు, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.