ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక 108/4

ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక 108/4

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మొహాలీ స్టేడియం వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ బ్యాటింగ్ చేపట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 574/8 వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా ( 175 నాటౌట్ ) భారీ శతకంతో చెలరేగగా, రిషబ్ పంత్ ( 96 ), అశ్విన్ ( 61 ), హనుమ విహారి (58) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ స్కోర్ సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నిశాంక ( 26 ), అసలంక (1)లు ఉన్నారు.ravindra jadejaముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక 108/4