సాయంత్రం 5గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ

సాయంత్రం 5గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది.సాయంత్రం 5గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీశాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ పై సమీక్షించి అవసరమైన సూచనలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.