అభివృద్ధికి కేంద్రంగా 60వ డివిజన్

అభివృద్ధికి కేంద్రంగా 60వ డివిజన్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ లో అభివృద్ధికి కేంద్రంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 60వ డివిజన్ ను తీర్చిదిద్దుతామని స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ అన్నారు. డివిజన్ పరిధిలోని ముదిరాజ్ వీధి ( కోటగడ్డ ) నుండి విజయ్ పాల్ కాలనీ వరకు రూ.98 లక్షల నిధులతో నూతన డ్రైవ్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ , ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే డివిజన్లు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడకుండా నేరుగా వారి సమస్యలను తెలుకుని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.అభివృద్ధికి కేంద్రంగా 60వ డివిజన్డివిజన్లలో పర్యటిస్తూ, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తీర్చుతున్న 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజులను ప్రభుత్వ చీఫ్ విప్ అభినందించారు. త్వరలోనే డివిజన్లలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయ్ భాస్కర్, కేశబోయిన అరుణ శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రాంరాజ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు స్నేహలత, అభినబి, యూత్ అధ్యక్షులు దినేష్, ఓబీసీ కమిటీ అధ్యక్షులు నవీన్, మైనారిటీ కమిటీ అధ్యక్షులు అక్మల్, సోషల్ మీడియా ఇంచార్జి విపుల్, డివిజన్ తెరాస నాయకులు, యూత్ నాయకులు, ఏ.ఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.