ఏపీ సీఎం విచారణకు రావాల్సిందే

ఏపీ సీఎం విచారణకు రావాల్సిందే

ఏపీ సీఎం విచారణకు రావాల్సిందేవరంగల్ టైమ్స్, గుంటూరు : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో నాడు జరిగిన దాడి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది.నేడు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది.

ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.ఇందులో బాధితుడి షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆ రోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేసింది.