మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీస్‌లో ఐటీ దాడులు

మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీస్‌లో ఐటీ దాడులు

మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీస్‌లో ఐటీ దాడులు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : హైద‌రాబాద్‌లోని మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. పుష్ప, శ్రీమంతుడు, సర్కార్‌ వారి పాట, రంగస్థలం, జనతా గ్యారేజ్‌ సినిమాలకు నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ పనిచేసింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌ అల్లు అర్జున్‌తో పుష్ప-2, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్‌ కల్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.