ఢిల్లీలో ముస్తాబవుతున్న బీఆర్ఎస్ ఆఫీస్

ఢిల్లీలో ముస్తాబవుతున్న బీఆర్ఎస్ ఆఫీస్

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : భారతదేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముస్తాబవుతోంది. ఈ నెల 14న ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎస్పీ రోడ్ గులాబీమయంగా మారడంతో పాటు రోడ్డుకు రెండువైపులా కేసీఆర్, బీఆర్ఎస్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ఎంపీలు పరిశీలించారు. ఢిల్లీలో ముస్తాబవుతున్న బీఆర్ఎస్ ఆఫీస్

నేడు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ రేపు స్వయంగా పార్టీ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం లాన్ లో యాగశాలను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. రాజశ్యామల, నవచండీ సహా మూడు యాగాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పూర్ణాహుతిలో పాటు పలు పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.