కొమురెల్లి మల్లన్న స్వర్ణ కిరీట నమూనా ఆవిష్కరణ

కొమురెల్లి మల్లన్న స్వర్ణ కిరీట నమూనా ఆవిష్కరణ

కోర మీసాల స్వామికి స్వర్ణ కిరీటం
కొమురెల్లి మల్లన్నకు ఆధ్యాత్మిక ఆభరణం..
కేసీఆర్ నేతృత్వంలో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..
రూ.4 కోట్ల విలువ చేసే ఆరున్నర కిలోల బంగారు కిరీటం..
కిరీటం నమూనాను ఆవిష్కరించిన మంత్రులు హరిశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి లు

వరంగల్ టైమ్స్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధి గాంచిన, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కోమరవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేపిస్తున్నట్లు మంత్రులు హరీశ్ రావు , ఇంద్రకరణ్ రెడ్డి లు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో మంత్రులు మల్లన్న స్వామికి చేపించే బంగారు కిరీటం నమూనాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల కొంగు బంగారం..పల్లె జాతరకు పల్లె ప్రజలకు కొంగు బంగారం కొమురెల్లి మల్లన్న అని మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు.కొమురెల్లి మల్లన్న స్వర్ణ కిరీట నమూనా ఆవిష్కరణసీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయాలకు ఆదరణ, అభివృద్ధిపై ప్రభుత్వం పక్షాన దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో ని ప్రముఖ పుణ్య క్షేత్రాలను భక్తులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పురాతన ప్రాచీన ఆలయాలకు గొప్ప ప్రాశస్త్యం తెస్తున్నామని చెప్పారు. అదే తరహాలో కోమరవెళ్లి మల్లన్న ఆలయాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

అందులో భాగంగా మల్లన్న స్వామికి రూ.4కోట్ల తో ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన చేపిస్తున్నట్లు పేర్కొన్నారు. కిరీటం తయారు పనులు వేగవంతగా జరుగుతున్నాయన్నారు. వచ్చే రెండు నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జోన్ ఉప కమీషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.