ఎండీ హోమీయో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఎండీ హోమీయో ప్రవేశాలకు నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మార్చి 21న ఉదయం 10 గంటల నుంచి 24న సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా AIAPGET-2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ https://tsmdayushaiq.tsche.in www.knruhs.telangana.gov.inను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.