బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం 

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతులు, ఇంటర్, డిగ్రీలో ఉన్న ఖాళీ సీట్లలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు తెలిపారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం http://mjptbcwreis. telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 6,7,8 తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీ అని, మే నెల 2న హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్ష మే 10న నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఇంటర్, డిగ్రీ సీట్ల కోసం ఏప్రిల్ 16 చివరి తేదీ కాగా ఏప్రిల్ 20 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆగష్టు 31నాటికీ అన్ని తరగతుల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040 – 23328266, 23322377 నంబర్లను సంప్రదించాలని మల్లయ్యభట్టు సూచించారు.