బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో ప్రవేశాలు

బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో ప్రవేశాలు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ఈ నెల 24నుండి 26 వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నేడు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలోని మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జనవరి 24న ఉదయం 8 గంటల నుంచి జనవరి 26 సాయింత్రం 4 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిదంగా కళాశాల వారిగా సీట్ల వివరాలను వెబ్సైట్ లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.