ఉక్రెయిన్ ను విడిచి వెళ్లింది ఎందరో తెలుసా ?

ఉక్రెయిన్ ను విడిచి వెళ్లింది ఎందరో తెలుసా ?

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై రష్యా దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సంఖ్య 32.50 లక్షలు అని వెల్లడించింది. ఇందులో 20 లక్షల మంది పోలాండ్ బార్డర్ దాటి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన రెఫ్యూజీస్ ఏజెన్సీ ప్రకటించింది.

ఉక్రెయిన్ ను విడిచి వెళ్లింది ఎందరో తెలుసా ?

ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీస్ ఏజెన్సీ ప్రతినిధి మైథ్యూ సాల్ట్ మార్ష్ మాట్లాడారు. యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నకొద్దీ ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దేశం విడిచి వెళ్లిన వారిలో 90 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే అత్యధికులు పోలాండ్ వైపు వెళ్లారన్నారు. దాదాపు 1,975,449 మంది పోలాండ్ వైపు వెళ్లారని పేర్కొన్నారు. ఇక రుమేనియా వైపు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారని ఆయన పేర్కొన్నారు.