టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా రాజీనామా
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : డిసెంబర్ 10న ప్రకటించిన పీసీసీ కమిటీపై మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నాయకునికి కాంగ్రెస్ పార్టీలో తగిన పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ అన్నారు. అందుకని తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నేరుగా కలిసి తెలిపారు.
రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లిన కొండా సురేఖ పీసీసీ కమిటీలో తనకు దక్కిన గౌరవాన్ని విమర్శిస్తూ, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మాకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మాభిమానం ముఖ్యమని తెలిపారు. తనతో పాటు తన భర్త పరకాల నియోజకవర్గ మరియు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. సామాన్య కార్యకర్తల్లాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కొండా సురేఖ తెలిపారు.