ఇండియన్ రేసింగ్ లీగ్ .. ఫస్ట్ విన్నర్ కొచ్చి

ఇండియన్ రేసింగ్ లీగ్ .. ఫస్ట్ విన్నర్ కొచ్చి

ఇండియన్ రేసింగ్ లీగ్ .. ఫస్ట్ విన్నర్ కొచ్చి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ ముగిసింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ లో కొచ్చి విజేతగా నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. 417.5 పాయింట్లతో కొచ్చి టాప్ ప్లేస్ సాధించింది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు 385 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. 282 పాయింట్లతో గోవా మూడో స్థానంలో, 279 పాయింట్లతో చెన్నై నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం లీగ్ లో భాగంగా ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. పోటీలను చూసేందుకు నగర వాసులు క్యూ కట్టారు. ఫార్ములా కార్ రేసులు పరిగెడుతుంటే ఉత్సాహంగా చూశారు.