తడిసిముద్దైన హైదరాబాద్ నగరం 

తడిసిముద్దైన హైదరాబాద్ నగరం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మాండౌస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరమంతా వర్షపు జల్లులతో తడిసిముద్దైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, నాంపల్లి బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీ కపూల్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, బాటసారులు తడిసిముద్దయ్యారు.