రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు 

రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సంచాలకులు పేర్కొన్నారు. రేపు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి, సాయంత్రం వాయుగుండంగా, నేడు ఉదయం 5.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని వివరించారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని వెల్లడించారు.