సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి శస్త్రచికిత్స

సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి శస్త్రచికిత్సహైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నిరోజులుగా మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో మహేష్ బాబు మోకాలికి ఫిజియో థెరపీ చేయించుకున్నారు. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స కోసం మహేష్ స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లో మహేష్ మోకాలికి ఆపరేషన్ జరిగింది.

ప్రస్తుతం స్పెయిన్ లోనే మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 24న స్పెయిన్ నుంచి దుబాయ్ కి మహేష్ వెళ్లనున్నారు.అదేరోజు హైదరాబాద్ నుంచి దుబాయ్ కి మహేష్ బాబు కుటుంబసభ్యులు కూడా వెళ్లనున్నారు.

కుటుంబసభ్యులతో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలను దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు. మహేష్ కి మోకాలి సర్జరీ అయిందని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ , పోస్టులు చేస్తున్నారు.

మహేష్ బాబు మరో రెండు నెలలు కచ్ఛితంగా విశ్రాంతి తీసుకోవాలి. దీంతో ప్రస్తుతం ఆయన నటిస్లున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. తర్వాత సినిమాలు కూడా మరింత ఆలస్యం అవుతాయని తెలుస్తుంది. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి నుంచి ‘సర్కారు వారి పాట’ మిగిలిన షూటింగ్ ని పూర్తి చేస్తారని సమాచారం.