తెలంగాణలో ఇద్దరికి ఒమిక్రాన్

తెలంగాణలో ఇద్దరికి ఒమిక్రాన్హైదరాబాద్ : తెలంగాణలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకుటు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వయసు 24 యేండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 యేండ్లు అని తెలిపారు.

ఈనెల 12నే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్ కు పంపగా, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. వీరిద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందన్నారు. వీరిద్దరిని టిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక మూడో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డాడు.అతని వయసు ఏడేళ్లు మాత్రమే. ఈ బాలుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కోల్ కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.