మరో భారత విద్యార్థి మృతి 

మరో భారత విద్యార్థి మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ కు చెందిన చందన్ జిందాల్ అనే 22 యేళ్ల మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్లు చెబుతున్నారు. మరో భారత విద్యార్థి మృతి 

రక్తం గడ్డ కట్టడంతో చందన్ జిందాల్ ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ విన్నిత్సియాలోని విన్సిత్సియా నేషనల్ పైరోగవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చందన్ జిందాల్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతని మృతితో వారి కుటుంబంలో విషాదంలో నెలకొంది.