6 వేల మంది రష్యా సైనికులు మృతి : జెలెన్ స్కీ

6 వేల మంది రష్యా సైనికులు మృతి : జెలెన్ స్కీ

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : రష్యాకు చెందిన 6 వేల మంది సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్ స్కీ తెలిపారు. గత గురువారం నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. సరిహద్దు సమీప నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా సైనికులకు ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది. అయితే ఉక్రెయిన్ చేసిన ప్రతిదాడిలో 6 వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు జెలెన్ స్కీ తెలిపారు.6 వేల మంది రష్యా సైనికులు మృతి : జెలెన్ స్కీఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఎంత మంది సైనికులు చనిపోయారో రష్యా అధికారికంగా వెల్లడించలేదు. 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, 211 ట్యాంకులు, 862 పెట్రోలింగ్ వాహనాలు, 85 ఆర్టిల్లరీ సిస్టమ్స్, 9 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్, 60 ఫ్యూయల్ ట్యాంకులు, 355 వాహనాలను ధ్వంసం చేసింది. 40 ఎంఎల్ఆర్ ఎస్ రాకెట్ లాంచర్లను కూడా ఉక్రెయిన్ సీజ్ చేసింది.