ఏటీఎం డబ్బు వాహనంతో డ్రైవర్‌ పరారు

ఏటీఎం డబ్బు వాహనంతో డ్రైవర్‌ పరారు

ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చి వాహనంతో డ్రైవర్‌ పరారు

కిస్మత్‌పూర్‌ బ్రిడ్జిపై డ్రైవర్‌ ఫారూఖ్‌ వదిలివెళ్లిన వాహనం

వరంగల్ టైమ్స్, రాజేంద్రనగర్: ఏటీఎంలో నగదు పెట్టడానికి వచ్చిన వాహనంతో డ్రైవర్‌ పరారైన ఘటన ఇది. రాజేంద్రనగర్‌ డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్‌ పవన్‌ తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌ కెనరా బ్యాంక్‌ ఎటీఎంకు ఉద్యోగులు అశోక్‌, భాస్కర్‌, కేవీ రమణ, చంద్రయ్యతో పాటు వాహన డ్రైవర్‌ బోరబండకు చెందిన ఫారూఖ్‌(25) రూ.31లక్షల నగదు తీసుకొచ్చారు.ఏటీఎం డబ్బు వాహనంతో డ్రైవర్‌ పరారుఉద్యోగులు ఏటీఎంలోకి వెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కడే ఉన్న డ్రైవర్‌ వాహనంతో పరారయ్యాడు. కొద్దిసేపటికి కేంద్రం నుంచి బయటకు వచ్చిన గన్‌మెన్‌ చంద్రయ్య వాహనం కనిపించకపోవడంతో లోపలఉన్నవారికి సమాచారం ఇచ్చాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన ఫారుఖ్‌ వాహనాన్ని కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి వద్ద నిలిపేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీచేసి రూ.3లక్షలతో డ్రైవర్‌ పరారైనట్లు గుర్తించారు. మిగిలిన రూ.28లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.