ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి

ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి

వరంగల్ టైమ్స్, నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అవ్వంగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.మొత్తం ఏడు మండలాల్లో 2.41 లక్షల మందికిపైగా ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీలతో 47 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పారామిలటరీ బలగాలు, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కు లేదు.ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డిఆయన ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు హక్కులేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో ఓటు హక్కు ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన అక్కడే ఓటు వేయాలి. అక్కడి నుంచి మునుగోడుకు ఆయన ఓటు హక్కును మార్చుకోలేదు. దీంతో ఆయన తనకు తాను ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడు.