ఓఆర్ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ మారింది

ఓఆర్ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ మారింది

వరంగల్ టైమ్స్, తెలంగాణ : హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) హెల్ప్ లైన్ నెంబర్ మార్చినట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఓఆర్ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ మారిందిఓఆర్ఆర్లో ఏదైనా అత్యవసర సమయంలో సహాయం కోసం ఇంతకుముందు ఉన్న 1066, 105910 నెంబర్ల స్థానంలో 14449 నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండు నెంబర్లను తొలగించి, సులువుగా ఉండేందుకు ఒకే నెంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.