బీహెచ్ఎంఎస్ నోటిఫికేషన్ రిలీజ్

బీహెచ్ఎంఎస్ నోటిఫికేషన్ రిలీజ్

యాజమాన్య కోటాలో హోమియోపతి సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ జారీ
ఈ నెల 5న ఆన్లైన్ కౌన్సెలింగ్
బీహెచ్ఎంఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ప్రైవేట్ హోమియోపతి కాలేజీల్లో బీహెచ్ఎంఎస్ కోర్స్ లో ప్రవేశాల కొరకు నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ కు కాళోజి హెల్త్ యూనివర్సిటీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్త్తైనట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అర్హుల జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందు పర్చారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న జేఎన్టీయు, కూకట్ పల్లి, హైదరాబాద్ కు ఆన్లైన్ కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది. మరింత సమచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.inచూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.