తప్పుడు కేసుపై బీజేపీ నేతల వార్నింగ్

తప్పుడు కేసుపై బీజేపీ నేతల వార్నింగ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమాచార హక్కు ద్వారా శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారు. ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని అన్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడుతారా, లేక టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వంత పాడతారా అని ప్రశ్నించారు.తప్పుడు కేసుపై బీజేపీ నేతల వార్నింగ్మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పెట్టిన తప్పుడు కేసుపై మాజీ మంత్రి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఈ కేసు వెనక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు ఆమె విమర్శించారు. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఈసీకీ ఫిర్యాదు చేయడంతో పాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, కబ్జాలపై బాధితులు గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారన్నారు. ఆరోపణలు తట్టుకోలేక బాధితులను కిడ్నాప్ చేయించారని ఆమె అన్నారు. బాధితుల భార్యా, పిల్లలు నా దగ్గరకు వస్తే కిడ్నాప్ వ్యవహారంపై మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.