గొర్రెకుంట శివారులో ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరం

గొర్రెకుంట శివారులో ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంట శివారులో ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి లాంఛనంగా ప్రారంభించారు.గొర్రెకుంట శివారులో ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరం

క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణ (సి.ఏ.టి.) వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సమ్మర్ క్యాంప్ గా ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణా శిబిరంలో క్రికెట్ పై ఆసక్తి కల్గిన గ్రామీణ ప్రాంత యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీపీ తరుణ్ జోషి లు కూడా గ్రౌండ్ లో బ్యాటింగ్ చేసి, క్రీడాకారులకు ఉత్సాహాన్ని కల్పించారు. చదువుతో పాటు, క్రీడల్లోనూ యువత రానించాలని వారు సూచించారు. క్రీడాకారులు ఉచిత శిక్షణా శిబిరాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఏ.టి ఫౌండర్ సునీల్ బాబు, జిల్లా అధ్యక్షులు బిళ్ళ రమణారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, కార్పొరేటర్లు మనోహర్, శివ, జెడ్పిటిసిలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.