ప్రధాన కార్యదర్శకులకు ప్రత్యేక బాధ్యతలు

ప్రధాన కార్యదర్శకులకు ప్రత్యేక బాధ్యతలుఅమరావతి : టీడీపీలో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శకులకు పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 25 లోక్​సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ఒక్కొక్కరికి ఐదు లోక్​సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలు, పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు , బత్యాల చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల , ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‍కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట , మాజీ మంత్రి అమర్‍నాథ్‍రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల , దేవినేని ఉమకు భావసారూప్య గల ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు, పయ్యావుల కేశవ్‍కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ , ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్‍సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యతను చంద్రబాబు అప్పగించారు.