ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ వెలువడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగనున్నది. ఎన్నికలకు మార్చి 23 న పోలింగ్ జరుగనున్నది. అదే రోజు కౌంటింగ్ జరుగనున్నది. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాకలు ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుల పదవీకాలం ఈ యేడాది మార్చి 29న ముగియనుంది. ఈ క్రమంలో ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.