మ్యాజిక్ పోటీల్లో పుట్ట తేజస్వికి సిల్వర్ మెడల్

మ్యాజిక్ పోటీల్లో పుట్ట తేజస్వికి సిల్వర్ మెడల్

మ్యాజిక్ పోటీల్లో పుట్ట తేజస్వికి సిల్వర్ మెడల్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : నిన్న సింహపురి మాయాజాల పేరుతో నెల్లూరులో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి మ్యాజిక్ పోటీల్లో వరంగల్ ఎస్ఆర్ నగర్ ఎనుమాములకు చెందిన పుట్ట తేజస్వి పాల్గొంది. మ్యాజిక్ పోటీల్లో పాల్గొనడమే కాకుండా విశేష ప్రతిభ కనబరిచి జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ గెల్చుకుంది. పుట్ట రాజేందర్-జానకి దంపతుల ప్రోత్సాహంతో చిన్నారి లేడీ ఎల్యూ జనిస్ట్,మకుల రజిత వద్ద మ్యాజిక్ నేర్చుకొని ఈ మెడల్ సాధించింది. సీనియర్ మెజీషియన్ బోస్ మరియు ఇతర మెజీషియన్లు చిన్నారిని సిల్వర్ మెడల్ తో సత్కరించారు. కాగా జిల్లా నుండి ఈ ఫెస్టివల్ కి మార్త రవి శ్రీనివాస్ రెడ్డి, రాజు, రాజశేఖర్, విజ్ఞ, వరదన్, జెకె, కవిత, ఆర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.