ఘన్ పూర్లో కేటీఆర్..150 కోట్ల పనుల ప్రారంభం

ఘన్ పూర్లో కేటీఆర్..150 కోట్ల పనుల ప్రారంభం

ఘన్ పూర్లో కేటీఆర్..150 కోట్ల పనుల ప్రారంభం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో రూ.150కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుండి నేరుగా మధ్యాహ్నం 1.55 ని.లకు సోడాషపల్లిలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే టి.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్ లైన్ ద్వారా 3 మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకానలు ప్రభుత్వం రూ. 104 కోట్లు ఖర్చు చేసి నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.ఘన్ పూర్లో కేటీఆర్..150 కోట్ల పనుల ప్రారంభంతర్వాత ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలేరు మండల కేంద్రం వరకు రూ. 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. నారాయణగిరి నుంచి పీచర వరకు రూ. 10 కోట్లతో వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే డా.టి రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,ఎమ్మెల్సీ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, సతీష్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జెడ్పీ చైర్మన్లు డా. సుధీర్ బాబు, కుసుమ జగదీష్ , జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మునిసిపల్ కమిషనరల్ ప్రావిణ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

KTR’s Rs 150 crore work has started in Sodashapalli ghanpur