భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి

భారీ వర్షాలు-అవసరమైతేనే బయటకు రండి

warangaltimes, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అటు నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురవగా మార్చిలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో 31.7 మి.మీ. వర్షపాతం నమోదవగా, 2014లో మార్చి 5న 38.4 మి.మీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.