25న అక్కినేని థ్యాంక్యూ టీజర్ వచ్చేస్తుంది!
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్: మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ చిత్రం థ్యాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం.లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.