ఆర్జీవీపై కేసు.. కారణం అదే !  

ఆర్జీవీపై కేసు.. కారణం అదే !

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఆర్జీవీ తన దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని శేఖర్ రాజు అనే వ్యక్తి కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దిశ సినిమా నిర్మాణానికి తన దగ్గర రూ. 56 లక్షలు తీసుకున్నారని తెలిపారు. కానీ అప్పుగా తీసుకున్న రూ. 56 లక్షలు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడుగుతుంటే ఆర్జీవీ తనను బెదిరించారని శేఖర్ ఫిర్యాదులో తెలిపాడు.ఆర్జీవీపై కేసు.. కారణం అదే !  ఇక విచారణ జరిపిన అనంతరం ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కూకట్ పల్లి న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆర్జీవీపై ఐపీసీలోని 406, 407, 506 సెక్షన్ల కింద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.