‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌

‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్టైనర్‌ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో సినిమా ‘థాంక్యూ’. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు. ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. 'థాంక్యూ' రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ‘నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియజేస్తారు.