రేపే కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలు

రేపే కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలువరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర రథసారధి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ ఎస్ నాయకులు ప్రతీ యేటా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చీఫ్ విప్ , ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సౌజన్యంతో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఈ టోర్నీ కొనసాగుతుంది. ఫిబ్రవరి 10న నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో ఈ పోటీలను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నట్లు నిర్వహకులు, కాకతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఎండీ ఫారుఖ్ అలీ తెలిపారు.

బుధవారం సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండీ ఫారుఖ్ అలీ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ క్రికెట్ చాంపియన్ షిప్ లో గెలుపొందిన విజేతలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారథ్యంలో క్రికెట్ ట్రోఫీని అందచేయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి రూ.75,116 మరియు కప్, రెండవ బహుమతి 35,116 మరియు కప్ అందచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన కరపత్రాన్ని నిర్వహకులు విడుదల చేశారు.రేపే కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలుఫిబ్రవరి 10 నుంచి క్రికెట్ పోటీల్లో పాల్గొనే వారి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా డివిజన్ల వారీగా ఇంఛార్జీలను నియమించారు. ఈ పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఉదయభాను, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, మనోజ్, ఖలీల్, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.

ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నిర్వహకులు పలు నిబంధనలు విధించారు.

నిబంధనలు..
*ప్రతీ డివిజన్ నుంచి ఒకటి లేదా రెండు టీమ్స్ మాత్రమే తీసుకోబడును.
*ప్రతీ టీం వైట్ టీ షర్ట్, వైట్ లోయర్, ష్యూస్ ఉంటేనే మ్యాచ్ కు అనుమతించబడును.
* రెసిడెన్షియల్ ప్రూఫ్, ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలి.
*రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 2000 మాత్రమే.
*ఎవరి క్రికెట్ కిట్టు వారే తెచ్చుకోవాలి.
*ప్రతీ మ్యాచ్ కు టెన్నిస్ బాల్ తో ఆడించబడును.
* ఎంపైర్ దే తుది నిర్ణయం.
*మ్యాచ్ లన్నీ నాక్ ఔట్ పద్ధతిలో నిర్వహించబడును.
*ప్రతీ మ్యాచ్ 10 ఓవర్లు, సెమీ ఫైనల్ మరియు ఫైనల్ కు 14 ఓవర్లతో ఆడించబడును.
*ప్రతీ జట్టులో ఆడిన క్రీడాకారుడు ఇంకో జట్టులో ఆడకూడదు.
*సరైన సమయానికి రానిచో టీంను తొలగించబడును.
*ప్రతీ రోజు 6 మ్యాచ్ లు ఆడించబడును.
*ప్రతీ మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వబడును.
* టోర్నమెంట్ సిరీస్ లో బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ కీపర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అంఫైర్స్ మరియు నిర్వహకులదే తుది నిర్ణయం.