హాకీ టోర్నీలో టీంఇండియా ఓటమి

హాకీ టోర్నీలో టీంఇండియా ఓటమిస్పోర్ట్స్ డెస్క్ : ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో టీంఇండియాకు భంగపాటు ఎదురైంది. బుధవారం రసవత్తరంగా సాగిన సెమీ ఫైనల్లో భారత్ 2 -3 తేడాతో కొరియా చేతిలో ఓటమిపాలైంది. 3, 4 స్థానాల కోసం శుక్రవారం జరిగే వర్గీకరణ మ్యాచ్ లో అమ్మాయిలు బరిలోకి దిగనున్నారు. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తరపున వందనా కటారియా ( 28ని.), లాల్ రెమిసియామి (54ని.) గోల్స్ చేయగా, చియోన్ (31ని.), సెంగ్ జులీ 9 45ని.), హైజిన్ చో (47ని.) కొరియాకు గోల్స్ అందించారు.

మ్యాచ్ తొలి క్వార్టర్ లో టీంఇండియా ఆధిపత్యం ప్రదర్శించినా, కీలకమైన ద్వితీయార్థంలో కొరియా అద్భుతంగా పుంజుకుంది. భారత ఢిపెన్స్ కు పరీక్ష పెడుతూ గోల్ పోస్ట్ పై మెరుపు దాడులకు పాల్పడింది. ప్రత్యర్థి దాడులను నిలువరించడంలో గోల్ కీపర్ సవిత ఒకింత సఫలమైనా లాభం లేకపోయింది.