మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావు

మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చందపి బిడ్డను బతికించారని అన్నారు..ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరుగలేదని అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడూ విషయం చిమ్మడమే ప్రధాని మోడీ పనా అంటూ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపి దయాకర్, ఎమ్మేల్యేలు నరేందర్, అరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావు

ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
మోడీకి కడుపు నిండా విషమే : హరీశ్ రావుఉద్యమకారుల బలిదానాలు కనిపించడం లేదా..?
మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు.. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే అమరులను కించపరచడమేనని మంత్రి హరీశ్ రావు ఆగ్రహించారు.. వరంగల్ లోనే ఎంత మంది బలిదానాలు చూశాము. ఎన్ని త్యాగాలు చూశాం, ఎన్ని శవాలు మోసామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందని హరీశ్ రావు ప్రశ్నించారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ ఏ ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారని ప్రధానిపై మండిపడ్డారు. మాటలతో హింస, తెలంగాణ ప్రజలను అవమానించేలా చర్యలు తీసుకోవడం బాధాకరం. అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా నల్ల వ్యవసాయ చట్టాలు ఎలా చేశారని మంత్రి ప్రధానిని ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినయ్..
తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమని , తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను చూస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినయని హెచ్చరించారు. తెలంగాణకు నిధులివ్వకుండా సూటిపోటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటుంది, అభివృద్ధి ఆగదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.

మా పని తీరు కళ్లకు కనిపిస్తలేదా.. ?
ఎంపిలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు వచ్చాయి.
ఇది మా పని తీరు.. కండ్లు కనిపిస్తలేదా… ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మోడీ ఇంకో మాట అంటారు..రాష్ట్రాలు కేంద్రం కలిసి ఉండాలని నీతులు బాగా చెబుతాడు. కానీ చేతల్లో మాత్రం చూపించరని విమర్శించారు. ఎందుకు మా ఏడు మండలాలు ఆదరాబాదరాగా ఆంధ్రాలో కలిపారు. ఎందుకు సీలేరు ప్రాజెక్టు అప్పగించారు. నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని హరీశ్ రావు నిలదీశారు.

వరంగల్ ను హెల్త్ సిటీగా మార్చాలని నిర్ణయించిన కేసీఆర్..
వరంగల్ అంటే సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ప్రేమ. అందుకే వరంగల్ ను హెల్త్ సిటీగా మార్చాలని కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉండగా, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నామన్నారు. 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నదని పేర్కొన్నారు. విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని హరీశ్ రావు గుర్తు చేశారు.

వైద్యారోగ్యం పై…
మంత్రుల కోరిక మేరకు సమ్మక్క సారక్క జాతరలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామని హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య శాఖ తరుపున పూర్తి స్థాయి ఏర్పాట్లు ఉంటాయన్నారు. రూ.7.5 కోట్లతో ఎమ్మారై స్కాన్, సెకెండ్ సీటీ స్కాన్ ని కూడా మంజూరు చేస్తున్నాం. త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో, 15-17 ఏళ్ల మధ్య వారికి మొదటి డోసు పూర్తి చేయడంలో హన్మకొండ ముందంజలో ఉన్నందున మంత్రులకు, ఇక్కడి జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లా కూడా వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సమ్మక్క జాతర తర్వాత ములుగు, సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు మొదలవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.

మోడీ వ్యాఖ్యలను జర్నలిస్టులు కూడా ఖండించాలి..
తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటు వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో మేనేజ్మెంట్ల ఒత్తిళ్లను సైతం తట్టుకుని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన దిశగా కలం బలాన్ని చూపించారని కొనియాడారు. అయితే మోడీ వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాలని హరీశ్ రావు కోరారు.