పేదల పాలిట పెన్నిది కేసీఆర్ ప్రభుత్వం: చల్లా

పేదల పాలిట పెన్నిది కేసీఆర్ ప్రభుత్వం: చల్లావరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని ఆయన ఆయన నివాసంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి /షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ. రూ.42 లక్షల 20 వేల విలువచేసే కళ్యాణలక్ష్మి/షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా అందచేశారు.

కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దళారులకు తావివ్వకుండా ప్రతీ సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఘనత కేసీఆర్ దని కొనియాడారు. రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వెల్లడించారు. . ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.