పరకాలలో చల్లా ధర్మారెడ్డి జోరు..! 

పరకాలలో చల్లా ధర్మారెడ్డి జోరు..!

పరకాలలో చల్లా ధర్మారెడ్డి జోరు..! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఎన్నికలెప్పుడో ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ పరకాల నియోజకవర్గంలో మాత్రం హడావుడి ఎక్కువగా ఉంది. రేపే ఎన్నికలా అన్నట్లుగా ఉంది ఇక్కడ వాతావరణం. పరకాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడు పెంచాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేయబోతుండగా , కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ బరిలో నిలవబోతున్నారు.

*ప్రజల మనిషి కాబట్టే ..
పరకాలలో రెండుసార్లు గెలిచిన చల్లా ధర్మారెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లడంలో ఆయన విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అందుకే ఊరూరా ధర్మారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. గులాబీ క్యాడర్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. దీనికితోడు ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు కూడా ధర్మారెడ్డికి మంచిపేరును తెచ్చిపెట్టాయి. ప్రతీ ఒక్కరి మంచి, చెడ్డా ఆయన చూసుకుంటారని నియోజకవర్గ జనం చెప్పుకుంటారు. వరుసగా రెండుసార్లు గెలవడం వెనుక కారణం కూడా ఇదేనని టాక్.

*ఆ ఘనత చల్లాకే దక్కింది..
పరకాలలో ఒకప్పుడు కొండా సురేఖ హవా ఉండేది. కానీ ఆ కోటను బద్దలు కొట్టిన ఘనత చల్లా ధర్మారెడ్డిదే. ఇక్కడ రెండుసార్లు గెలవడం అంటే అంత ఆషామాషీ కాదు. అది చల్లా ధర్మారెడ్డికే సాధ్యమైంది. 2014లో టీడీపీ తరపున జెండా పాతిన ధర్మారెడ్డి, 2018లో టీఆర్ఎస్ తరపున విజయఢంకా మోగించారు. అది కూడా కొండా సురేఖ పైన. గత ఎన్నికల్లోనైతే కొండాపై ఏకపక్ష విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.పరకాలలో చల్లా ధర్మారెడ్డి జోరు..! * చల్లా అంటే సీఎం కేసీఆర్ కు ఇష్టమెందుకు..
కొండా కుటుంబానికి ధీటుగా రాజకీయం చేయడం పిల్లలాట కాదు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలి. అనునిత్యం ప్రజల్లో ఉండాలి. అవన్నీ చేసే దమ్ముంది కాబట్టే చల్లా ధర్మారెడ్డి పరకాలలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆజోరును ఇంకా కొనసాగిస్తున్నారు. అంతేకాదు చల్లా ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఆశీస్సులు కూడా బలంగా ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దీనికి తోడు యువనేత, మంత్రి కేటీఆర్ కు కూడా ధర్మారెడ్డి అంటే ఇష్టమని టాక్.వ్యక్తిగతంగా తనకు ఇది కావాలని చల్లా ధర్మారెడ్డి ఎప్పుడు కూడా కేసీఆర్ ను కానీ, కేటీఆర్ ను కానీ కోరలేదట. దందాలు, పైరవీలు చేసిపెట్టమని ఎప్పుడూ సంప్రదించలేదట. ధర్మారెడ్డి ఎప్పుడు వెళ్లినా కేసీఆర్ తో నియోజకవర్గ అభివృ ద్ధి గురించే మాట్లాడతారని గులాబీ శ్రేణులు చెబుతుంటారు.తన కోసం కాకుండా ప్రజల కోసం తాపత్రయపడే నాయకుడంటే సీఎం కేసీఆర్ కు ఎంతో ఇష్టం. అందుకే చల్లా ధర్మారెడ్డి ఏది అడిగినా సీఎం కేసీఆర్ వెంటనే మంజూరు చేస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు.పరకాలలో చల్లా ధర్మారెడ్డి జోరు..! 

*నో కాంప్రమైజ్ అంటున్న ఎమ్మెల్యే చల్లా..
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల ఇప్పుడు ధర్మారెడ్డి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు అందుతున్నాయి. దీనికి తోడు ప్రజల్లో ధర్మారెడ్డికి మంచి పేరుంది. అందుకే ఈసారి కూడా చల్లా ధర్మారెడ్డి గెలుపు లాంఛనమేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇటీవల ధర్మారెడ్డి ఓ సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో ధర్మారెడ్డికి బంపర్ మెజార్టీ ఖాయమని తేలిందట. అయినప్పటికీ చల్లా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

*కొండా పోటీ ఎక్కడ..?
అటు కాంగ్రెస్ నుంచి పరకాల అభ్యర్థిగా కొండా సురేఖ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఒకప్పటి ఉత్సాహం కొండా ఫ్యామిలీలో లేదని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కొండా కుటుంబానికి గట్టి పట్టున్న ప్రాంతాలన్నీ ఇప్పుడు గులాబీ వశమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలోనైతే గులాబీపార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. దీంతో కొండా ఏటికి ఎదురీదుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే హస్తం పార్టీలో నిరాశ నెలకొంది. క్యాడర్ లో జోష్ కనిపించడం లేదు. కొండా కుటుంబం కూడా పరకాలపై అంత సీరియస్ గా దృష్టి పెట్టడం లేదన్న మాట వినిపిస్తోంది. అందుకే పరకాల కాకుండా భూపాలపల్లి లేదా వరంగల్ ఈస్ట్ కు మారుదామని కూడా కొండా సురేఖ ఆలోచిస్తున్నారన్న వాదన కూడా ఉంది. బీజేపీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభావం చూపే అంత ఓటు బ్యాంకు అయితే ఇక్కడ లేదు. దీంతో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉంది.

*వార్ వన్ సైడ్ అయినా..తగ్గేదేలే అంటున్న చల్లా..
ఇంతకు ముందులా కొండా దంపతులు జోష్ లో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ను ఏమాత్రం లైట్ తీసుకోవద్దని గులాబీ క్యాడర్ కు చల్లా ధర్మారెడ్డి సూచిస్తున్నారు. వార్ వన్ సైడే అయినప్పటికీ కొండా సురేఖ బరిలో ఉంటే పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని చెబుతున్నారట. అందుకే కాంగ్రెస్ కు ధీటుగా చల్లా ధర్మారెడ్డి పక్కా ప్రిపరేషన్ చేసుకుంటున్నట్లు టాక్. ఎవరి వాదన ఎల్లా ఉన్నా పరకాలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇప్పట్నుంచి చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి. మరి ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారన్నది వేచి చూడాలి.