టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త..కారణం ఏంటి ?

టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త..కారణం ఏంటి ?వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెపై హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించిన సీఎం కేసీఆర్ ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్న మాటలపై పలువురు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ పలు చోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ నిరసనలు తెల్పుతుండగా, కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండలో ఓ బీజేపీ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కేయూ జంక్షన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు చొరవ తీసుకుని బీజేపీ కార్యకర్తను దింపే ప్రయత్నం చేస్తున్నా ససేమిరా అంటుండంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.